ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన (Delhi tour)కు సిద్ధమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సహకారం అందించే దిశగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఆర్థిక సహాయం, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయడం ప్రధాన అజెండాగా ఉంది.

గన్నవరం నుంచి ఢిల్లీకి సీఎం ప్రయాణం
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. రేపు మధ్యాహ్నం వరకు ఆయన అక్కడే ఉంటారు.
నిర్మలా సీతారామన్‌తో కీలక భేటీ
రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ను సీఎం చంద్రబాబు కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆమెకు వివరించనున్నారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీర్చేలా కేంద్ర సహాయం అందించాలని, ముఖ్యంగా సాస్కి (Special Assistance Scheme) తరహా నిధులతో పాటు పూర్వోదయ పథకం వంటి కేంద్ర ప్రాజెక్టుల కింద కూడా ఆంధ్రప్రదేశ్‌కు తగిన వనరులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
వరల్డ్ లీడర్స్ ఫోరంలో పాల్గొనబోయే సీఎం
రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరగబోయే ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఈ వేదికలో రాష్ట్ర అభివృద్ధి దిశలో చేపడుతున్న చర్యలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.
తిరుగు ప్రయాణం అమరావతికి
అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు.
Read hindi news: hindi.vaartha.com
read also: