ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తీసుకొచ్చిన ప్రత్యేక “ఫ్రీడమ్ ప్లాన్”కు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో, సంస్థ ఈ ప్లాన్ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది.
ఆగస్టులో ప్రారంభమైన ప్రత్యేక ఆఫర్
ఈ ఆఫర్‌ను స్వాత్రంత్య దినోత్సవం (Independence Day)సందర్భంగా ఆగస్టు 1న ప్రారంభించారు. మొదట ఈ ప్లాన్ ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.

ప్లాన్ వివరాలు: ఒక్క రూపాయికి అపరిమిత ప్రయోజనాలు
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు కేవలం ₹1కే 30 రోజుల పాటు క్రింది సేవలను పొందగలరు. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, ఉచిత 4G సిమ్ కార్డు ఈ ఆఫర్ వినియోగదారుల్లో విశేషంగా ఉత్సాహం నెలకొల్పింది.
4జీ సేవల విస్తరణపై బీఎస్‌ఎన్‌ఎల్ భావనలు
బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ జె. రవి మాట్లాడుతూ, “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఆధునిక 4జీ నెట్‌వర్క్ ప్రారంభించామని తెలిపారు. తక్కువ ధరకు అధునాతన 4జీ సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ప్లాన్‌ను ఎలా పొందాలి?
ఈ ఆఫర్‌ను పొందాలంటే వినియోగదారులు:
- తమకు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా
- అధికారిక రిటైలర్‌ను సంప్రదించాలి.
మరిన్ని వివరాల కోసం 1800-180-1503 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా www.bsnl.co.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Read also: