భారతదేశంలోని ప్రముఖ స్టార్టప్ విజయగాథల్లో ఒకటిగా నిలిచిన బిరా 91 (Bira 91) కంపెనీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. గత దశాబ్దంలో యువతలో అత్యంత ప్రాచుర్యం పొందిన కూల్ బీర్ (Cool beer)బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, ఒక చిన్నపాటి పేరు మార్పు కారణంగా ఇప్పుడు పెద్ద తలనొప్పిని ఎదుర్కొంటోంది. పేరు మార్పు వ్యూహం మార్కెటింగ్‌లో కొత్త ట్రెండ్‌గా భావించిన సంస్థకు, అది ఇప్పుడు వ్యతిరేక ఫలితాన్నే తీసుకొచ్చింది.
Diwali : దీపావళికి 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ
ఇన్వెస్టర్ డి. ముత్తుకృష్ణన్ శుక్రవారం సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ చేసారు.ఆ పోస్ట్ లో ఏమని రాసుకొచ్చారంటే.దీని ఫలితంగా.. కంపెనీ ఉద్యోగులే ఆ సంస్థ వ్యవస్థాపకుడిని తమ పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి చేస్తున్నారనే సంచలన విషయాన్నిసోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తీవ్ర దుమారం రేపుతోంది.బిరా 91 సంస్థ అద్భుతంగా ఎదుగుతోందని..
అయితే ఊహించని విధంగా కేవలం ఒక విధానపరమైన పొరపాటు కారణంగా మొత్తం కంపెనీ కుప్పకూలిపోయిందని.. డి ముత్తుకృష్ణన్ (D. Muthukrishnan) పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ ఫౌండర్‌ను ఉద్యోగులు రాజీనామా చేయాలని బలవంతం చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐపీఓ కోసం
2023 చివర్లో.. బీ9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (Beverages Private Limited Company) తన దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐపీఓ కోసం సిద్ధం అవుతోంది.లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా బీ9 బెవరేజెస్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ పేరులో ఉన్న ప్రైవేట్ పదాన్ని తొలగించి.. దాన్ని బీ9 బెవరేజెస్ లిమిటెడ్‌గా మార్చాలని నిర్ణయించింది.
దీని కోసం 2024 జనవరిలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద పేరు మార్చినా.. ఇప్పటికే ఉన్న స్టాక్ కారణంగా పాత పేరుతో ఉన్న ప్యాకేజింగ్, లేబుల్, లైసెన్స్‌లు మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి.అయితే అసలు సమస్య అక్కడే మొదలైందని ముత్తుకృష్ణన్ తెలిపారు. అన్ని రాష్ట్రాలు వెంటనే బిరా 91 (Bira 91) అమ్మకాలపై నిషేధం విధించాయని.. కొత్త పేరును వేరే సంస్థగా పరిగణించి..

ప్రతీ వేరియంట్‌కు కొత్త చట్టపరమైన అనుమతులు
ప్రతీ వేరియంట్‌కు కొత్త చట్టపరమైన అనుమతులు, లేబుల్ ఆమోదాలు, ఉత్పత్తి రిజిస్ట్రేషన్లు, కొత్త లైసెన్స్‌లు అందించాలని డిమాండ్ చేశాయి. ఈ కారణంగా ఓవర్‌నైట్‌లో ఆ బ్రాండ్ పంపిణీ ఆగిపోయిందని తెలిపారు.
కోట్ల విలువైన సరుకు అమ్ముడుపోకుండా కంపెనీ గోదాముల్లో నిలిచిపోయిందని వెల్లడించారు.2024 జూలై-సెప్టెంబర్ మధ్య బిరా 91 అమ్మకాలు ఏడాదివారీగా ఏకంగా 25 శాతం తగ్గాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.824 కోట్ల నుంచి రూ.638 కోట్లకు పడిపోయింది.
నిపుణుల సలహా తీసుకోకపోతే వ్యతిరేకంగా
అంతేకాకుండా.. రూ.748 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంవత్సరంగా పేర్కొన్నారు.కొన్ని నెలల పోరాటం తర్వాత.. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ చాలా రాష్ట్రాల్లో తిరిగి అనుమతులు పొంది.. మళ్లీ ఉత్పత్తిని క్రమంగా ప్రారంభించింది. అయినప్పటికీ బిరా 91 బ్రాండ్ తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది.
దీంతో ఆ సంస్థ ఐపీఓకు వెళ్లాలనే ప్రణాళికను నిరవధికంగా వాయిదా వేసుకుంది. భారత్‌లో ఉన్న అధికారిక చిక్కుల కారణంగానే బిరా 91 బ్రాండ్ కుప్పకూలింది. నిబంధనలు, డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యమైనవని.. నిపుణుల సలహా తీసుకోకపోతే వ్యతిరేకంగా మారవచ్చని ముత్తుకృష్ణన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: