కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) ప్రయాణికులు, డ్రైవర్లకు ఒక పెద్ద ఊరటగా మారనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలైన Uber, Olaలకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ యాప్‌ను జనవరి 1 నుంచి ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది.
Read Also: Police Band Competition: 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం
56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారు
తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.

ప్రైవేట్ క్యాబ్ యాప్‌లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక ఛార్జీలు. పీక్ టైమ్‌లలో, మూడింతల చార్జీలు వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: