హానగరాల్లో మానవుడు ఒంటరివాడే. చుట్టూ ప్రజలున్నా.. తన మనసును పంచుకునే తోడులేకపోతే ఆ బాధే వర్ణనాతీతం. అందుకే ‘మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యనిమల్(Social Animal)’ అని అంటారు. మానవుడు సామాజికంగా ఇరుగుపొరుగు వారు లేకుండా జీవించలేరు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే గ్యాజెట్లు వచ్చాక మనిషి మరింత ఒంటరితనంలోకి కూరుకునిపోతున్నాడు. ఇంట్లో నలుగురు ఉంటే, నలుగురు నాలుగు మొబైల్ఫోన్లతో ఎవరికివారే నిమగ్న ఉంటున్నారు. మరి ఒంటరిరాకపోతే(alone) ఏం వస్తుంది. కుటుంబంలో కలిసి మెలసి అనుబంధాలను మాటలతో వ్యక్తం చేసుకుంటే ఆ మనోధైర్యమే వేరు. ఒంటరితనం శాపం కాదు.
అదొక మానసిక జబ్బు. దాన్ని జయించాలి. అందుకు మనమే పనులను కల్పించుకోవాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఓ బిటెక్ విద్యార్థి చదువులో మంచిమార్కులు వచ్చినా, ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన కమ్మ శ్రావ్య (20) గుంటూరు అశోక్ నగర్ లోని నవీన లేడీస్ హాస్టల్ లో ఉంటూ వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. శ్రావ్య(Shravya) తన తల్లిదండ్రడలకు దూరంగా ఉండటం వల్ల ఒంటరితనంగా ఫీలయ్యేది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తన స్నేహితురాలు జాగృతికి ఫోన్ చేసిన శ్రావ్య చాలాసేపు మాట్లాడింది. ఈ సందర్భంగా తాను ఒంటరితనంతో బాధపడుతున్నట్లు, బతకాలని లేదని.. ఆత్మహత్య చేసుకుంటానని వాపోయింది.
వెంటనే అలర్ట్ అయిన స్నేహితురాలు శ్రావ్య సోదరుడికి కాల్ చేసి చెప్పింది. ఆయన వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఫోన్ చేసి, పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పడంతో పాటు..మేము వచ్చి తీసుకెళ్తామని, ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని నచ్చజెప్పారు. అయితే మీరు రావద్దని సెలవులిస్తే.. తానే ఇంటికి వస్తానని శ్రావ్య చెప్పడంతో, వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. శ్రావ్య రూమ్మెంట్ హిమసిరితో మాట్లాడి శ్రావ్యను జాగ్రత్తగా చూడాలని తల్లిదండ్రులు కోరారు.
నోటికి ప్లాస్టర్, ముక్కుకు క్లిప్పుతో ఆత్మహత్య
హిమసిరి ఆదివారం అర్థరాత్రి వరకు శ్రావ్యతో కబుర్లు చెప్పుకుంటూ గడిపింది. అనంతరం పడుకుందామని హిమసిరి కోరగా నేను తర్వాత నిద్రపోతానని శ్రావ్య బదులిచ్చింది. దీంతో హిమసిరి నిద్రపోయాక, శ్రావ్య నోటికి ప్లాస్టిర్ వేసుకుని, ముక్కుకు క్లిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం తోటి విద్యార్థినులు లేపి చూడగా శ్రావ్య అచేతనంగా పడిఉంది. ఈ విషయాన్ని గమనించి, వెంటనే వార్డెన్ కు చెప్పారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వరు, ఎస్ఐ తరంగిణి సంఘటనా స్థలానికి చేఉకుని శ్రావ్య మృతదేహాన్ని పరిశీలించారు. శ్రావ్య తల్లి ఉమా రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరితనమే ఆమెను కుంగదీసం ఆత్మహత్య చేసుకునేందుకు దోహదం చేసిఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు?
బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
కారణం ఏమిటి?
ఒంటరితనం, చదువులో ఒత్తిడి కారణంగా విద్యార్థిని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: