Axis Bank Scam: ముత్తుకూరు (నెల్లూరు) : ముత్తుకూరులో 10కోట్ల 60లక్షల రూపాయలు యాక్సిస్ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో కేటుగాళ్లు (Ketugal) కీలక పాత్ర వహించారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామని సుమారుగా 56 మంది పేర్లతో రుణాలు తీసుకుని కాజేసారు.
ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసి అందులో గిరిజనులను ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద అప్లై చేయించి చేసినవ్యక్తులు ఫేక్ కంపెనీలో ఆరు నెలలు పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్ క్రియేట్ (Create statement) చేసి లోన్లు తీసుకున్నారు.
అయితే ఈ స్కామ్ 2022 -24 మధ్య జరిగింది. గిరిజనులను యాక్సిస్ బ్యాక్ (Axis Bank Scam) యాజమాన్యం లోను కట్టమని నోటీసులు జారీ చేసింది. 2024లో నలుగురి పేరు మీద యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేసారు. ఈ స్కామ్లో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు వ్యక్తమౌతున్నాయి.
యాక్సిస్ బ్యాంక్ యజమాని ఎవరు?
యాక్సిస్ బ్యాంక్ ప్రధానంగా సంస్థాగత పెట్టుబడిదారులు, రిటైల్ పెట్టుబడిదారులు మరియు మ్యూచువల్ ఫండ్లతో సహా దాని వాటాదారుల యాజమాన్యంలో ఉంది. దీనిని ప్రారంభంలో స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (SUUTI), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరియు ఇతరులు ప్రమోట్ చేసినప్పటికీ, ప్రస్తుతం LIC మాత్రమే మిగిలి ఉన్న ప్రమోటర్.
యాక్సిస్ బ్యాంక్ బలమైన బ్యాంకునా?
యాక్సిస్ బ్యాంక్ ICC ఎమర్జింగ్ ఆసియా బ్యాంకింగ్ అవార్డులు 2024 గెలుచుకుంది: భారతదేశంలో ఉత్తమ బ్యాంక్ (ప్రైవేట్ రంగం – పెద్దది) ఉత్తమ ప్రైవేట్ బ్యాంక్ (పెద్దది): లాభదాయకతపై ఉత్తమ పనితీరు.
Read hindi news: hindi.vaartha.com
Read also: US: పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉంది ఆ గ్రూపే.. అమెరికా కీలక నిర్ణయం