ఏటీఎంల్లో (ATMs) రూ.100, రూ.200 నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎంల్లో (ATMs)ఎప్పటికప్పుడు ఈ నోట్లు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన గడువుకు మూడు నెలల ముందే వీటి లభ్యత 73 శాతం పెరిగింది. గతేడాదిలో డిసెంబర్‌లో 65 శాతంగా ఉన్న ఈ నోట్ల లభ్యత ప్రస్తుతం 73 శాతానికి చేరింది. ఏటీఎంలను నిర్వహిస్తున్న సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఈ గణాంకాల్ని వెల్లడించింది.
ప్రజల కోసం చిన్న నోట్లు
ప్రజలు ఎక్కువగా వాడే నోట్ల లభ్యతను పెంచే ఉద్దేశంతో బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం (ATM)ఆపరేటర్లు వాటి ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు అందుబాటు ఉండేలా చూడాలని ఆర్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది. 2025 సెప్టెంబరు 30 నాటికి 75 శాతం ఏటీఎంలు, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంల్లో రూ.100 లేదా రూ.200 నోట్ల ఉపసంహరణ జరగాలని తెలిపింది. ఇక ఆర్‌బీఐ నిర్దేశించిన గడువుకు మూడు నెలల కంటే ముందే ఈ నోట్ల వినియోగం 73 శాతం చేరడం విశేషం.

బ్యాంకుల స్పందన
బ్యాంకులు తమ ఏటీఎంల్లో చిన్న నోట్ల స్టాక్‌ను నియమితంగా నింపుతున్నాయి. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా RBI ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. పాత ఏటీఎంలలో పెద్ద నోట్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా ట్రేలు ఉండేవి. రూ.100, ₹200 నోట్ల లభ్యతలో పెరుగుదల ప్రజలకు నగదు లావాదేవీలలో ఎంతో సౌలభ్యం కలిగించనుంది. RBI నిర్దేశించిన గడువులను ముందుగానే చేరుకోవడం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు మంచి సూచన. ప్రజలు చిన్న మొత్తాల చెల్లింపుల కోసం ఇక ఏటీఎంల ముందు తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు.
Read Also: Epfo: మధ్యవర్తుల అక్రమ వసూళ్లు – ఈపీఎఫ్‌ఓ సీరియస్