రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) కి ప్రస్తుత సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Ed) బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో ఆయనపై ఆ శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీకి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీచేసింది.

ఆగస్టు 5న విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ ఆదేశం
ఈడీ తాజా సమన్ల ప్రకారం, అనిల్ అంబానీ (Anil Ambani) ఆగస్టు 5, 2025న విచారణకు హాజరుకావలసి ఉంటుంది. ఈ విచారణలో ఆయన్ను ఆర్థిక మోసాలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు.
50 కంపెనీలపై ఈడీ సోదాలు
ఈ విచారణకు ముందు జూలై 24న ఈడీ పెద్ద ఎత్తున దాడులు జరిపింది. అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు (50 companies), 25 మంది వ్యాపార భాగస్వాములు, మరియు గ్రూప్‌కు చెందిన 35 కార్యాలయాల్లో అకస్మిక సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అనేక కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మనీలాండరింగ్ చట్టం కింద సోదాలు
ఈడీ చేపట్టిన ఈ దాడులు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద భాగంగా జరిగాయి. మూడు రోజులపాటు కొనసాగిన ఈ తనిఖీల్లో, అనేక ఆర్థిక లావాదేవీలపై ఆధారాలు వెలుగులోకి వచ్చాయని భావిస్తున్నారు. ఇందులో కొన్ని డాక్యుమెంట్లు విదేశీ లావాదేవీలకు సంబంధించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఈడీ అనిల్ అంబానీకి ఎందుకు సమన్లు జారీ చేసింది?
ఈడీ అనిల్ అంబానీపై రూ.17,000 కోట్ల రుణ మోసానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో అనుమానాస్పద లావాదేవీలు, మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరిపే భాగంగా ఆయనకు సమన్లు జారీ చేశారు.
అనిల్ అంబానీ ఆస్తి విలువ ఎంత?
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 2006 జూలైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి విభజన తరువాత ఏర్పడింది. ఆయన రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, మరియు రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి పలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలను నడిపారు. అనిల్ అంబానీ నికర ఆస్తి విలువ సుమారుగా 3 బిలియన్.
Read hindi news: hindi.vaartha.com
Read also: Chenab River : పాకిస్థాన్ పై భారత్ కీలక నిర్ణయం : చీనాబ్ నదిపై సావల్‌కోట్ ప్రాజెక్టు!