Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో మద్య విక్రయాల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు కీలక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో కేవలం 30 శాతంగా ఉన్న డిజిటల్ లావాదేవీలను 60 శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ అనే సరికొత్త పాలసీని అమల్లోకి తీసుకురానుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా విక్రయాల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Ownly Food Delivery: జొమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో ‘ఓన్లీ’

‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానంతో విక్రయాల పర్యవేక్షణ
ఈ నూతన విధానం ప్రకారం, రాష్ట్రంలోని ప్రతి మద్యం దుకాణంలో డిజిటల్ పేమెంట్ సౌకర్యం ఉండటం ఇకపై తప్పనిసరి. వినియోగదారులు యూపీఐ (UPI), కార్డులు లేదా ఇతర ఆన్లైన్ పద్ధతుల ద్వారా చెల్లింపులు చేస్తామంటే లైసెన్సీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదు. దీనివల్ల కొనుగోలుదారులకు చిల్లర సమస్యలు తప్పడమే కాకుండా, విక్రయాల రికార్డులు పక్కాగా నమోదవుతాయి.
విక్రయాల పర్యవేక్షణ కోసం ఎక్సైజ్ శాఖ ‘ట్రాక్ అండ్ ట్రేస్’ (Track and Trace) అనే అత్యాధునిక విధానాన్ని కూడా ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా ప్రతిరోజూ ఏ షాపులో ఎంత మద్యం విక్రయించారో, ఏ బ్రాండ్లకు డిమాండ్ ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: