ప్రపంచ ప్రఖ్యాత కాఫీ స్టార్‌బక్స్ తమ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) గా భారత సంతతికి చెందిన ఆనంద్ వరదరాజన్ (Anand Varadarajan) ను నియమించింది. ఆయన గతంలో 19 ఏళ్ల పాటు అమెజాన్ (Amazon) లో పనిచేశారు. అక్కడ గ్లోబల్ గ్రోసరీ బిజినెస్‌కి టెక్నాలజీ అండ్ సప్లైచైన్ హెడ్‌గా పనిచేశారు. ఒరాకిల్‌లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.
Read Also: America: ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

ఆనంద్ బాధ్యతలు
IIT నుంచి అండర్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత పర్డ్యూ, వాషింగ్టన్ యూనివర్సిటీల నుంచి మాస్టర్స్ చేశారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతికతను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత, సెప్టెంబరులో పదవీవిరమణ చేసిన డెబ్ హాల్ లెఫెవ్రే స్థానంలో ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: