हिन्दी | Epaper

AmritBharat Train: అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం

Pooja
AmritBharat Train: అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం

AmritBharat Train: భారత రైల్వే శాఖ(Indian Railways) అమృత్ భారత్ స్లీపర్ రైళ్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే సామాన్య ప్రయాణికుల కోసం నాన్ ఏసీ కోచ్‌లతో అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే, ఇప్పుడు అప్గ్రేడ్ వెర్షన్‌గా అమృత్ భారత్ 3.0 రైళ్లను తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం వందే భారత్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల బడ్జెట్‌లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను కూడా ప్రకటించగా, వచ్చే కొన్ని సంవత్సరాల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.

Read Also: Ahmedabad-Gorakhpur Express : దారుణానికి ఒడిగట్టిన TTE ..ప్రయాణికురాలిపై అత్యాచారం

AmritBharat Train
Amrit Bharat 3.0 trains to start soon

అమృత్ భారత్ 3.0లో కొత్త ఫీచర్లు

ప్రస్తుతం అమృత్ భారత్ 1.0, 2.0 వెర్షన్ రైళ్లు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. వీటిలో నాన్ ఏసీ జనరల్ మరియు స్లీపర్ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే త్వరలో రానున్న అమృత్ భారత్ 3.0 రైళ్లలో ఏసీ కోచ్‌లను కూడా జోడించనున్నారు. ఈ కొత్త వెర్షన్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు చివర్లలో లోకోమోటివ్‌లు ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు.

ఏప్రిల్‌లో ప్రారంభానికి సన్నాహాలు

చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం రెండు అమృత్ భారత్ 3.0 రైళ్ల తయారీ జరుగుతోంది. రైళ్ల తయారీ పూర్తయ్యాక వాటిని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌కు పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని అనుమతులు పూర్తయిన తర్వాత ఏప్రిల్ నాటికి ఈ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 50 అమృత్ భారత్ 3.0 రైళ్లను తయారు చేసే బాధ్యతను చెన్నై కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 అమృత్ భారత్ రైళ్లు నడుస్తుండగా, వాటిలో మూడు రైళ్లు తమిళనాడు నుంచి సేవలందిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎప్స్టీన్ ఫైల్స్లో స్టీఫెన్ హాకింగ్ ఫోటోపై క్లారిటీ

ఎప్స్టీన్ ఫైల్స్లో స్టీఫెన్ హాకింగ్ ఫోటోపై క్లారిటీ

క్యాన్సర్ ముందస్తు సంకేతాలు

క్యాన్సర్ ముందస్తు సంకేతాలు

షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ ఇవ్వాలా..?

షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ ఇవ్వాలా..?

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

సైనికుల మృతదేహాలను ఇచ్చిపుచ్చుకున్న రష్యా, ఉక్రెయిన్

సైనికుల మృతదేహాలను ఇచ్చిపుచ్చుకున్న రష్యా, ఉక్రెయిన్

నాని ‘ప్యారడైజ్’ సాంగ్‌పై కాపీ వివాదం
0:17

నాని ‘ప్యారడైజ్’ సాంగ్‌పై కాపీ వివాదం

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే పాములు రావు

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే పాములు రావు

భూదాన్ బాధితులకు కేటీఆర్ భరోసా

భూదాన్ బాధితులకు కేటీఆర్ భరోసా

ట్రేడ్​ డీల్ వల్ల రైతులకు భారీ నష్టం: రాహుల్ గాంధీ

ట్రేడ్​ డీల్ వల్ల రైతులకు భారీ నష్టం: రాహుల్ గాంధీ

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని దుర్మరణం

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని దుర్మరణం

న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం ..సుప్రీంకోర్టు మండిపాటు

న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం ..సుప్రీంకోర్టు మండిపాటు

కల్తీ పాలపై సర్కారు ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

కల్తీ పాలపై సర్కారు ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

📢 For Advertisement Booking: 98481 12870