ఈ-కామర్స్(E-commerce) దిగ్గజం అమెజాన్( Amazon) తన వినియోగదారుల కోసం మరొక ఉపయోగకరమైన ఫీచర్‌ను ప్రకటించింది. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి ఎంతో సహాయపడే ‘ప్రైస్ హిస్టరీ’ ఫీచర్ ఇప్పుడు మొబైల్ యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఒక వస్తువు ధర గత 30 నుండి 90 రోజులలో ఎలా మారిందో—ఏ సమయంలో తక్కువగా, ఏ సమయంలో ఎక్కువగా ఉందో—సులభంగా తెలుసుకోవచ్చు.
Read Also: fake voters FIR : బెంగళూరులో ‘వోటు చోరీ’ కేసు నకిలీ ఓటర్ల కుట్రపై FIR నమోదు

ఇప్పటివరకు ఉత్పత్తుల ధరల మార్పులను తెలుసుకోవడానికి వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్‌లు, వెబ్‌సైట్లపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే ఈ అసౌకర్యాన్ని తొలగిస్తూ, ఇప్పుడు అమెజాన్( Amazon) యాప్‌లోనే ఈ సమాచారం అందిస్తోంది.
ఒక ప్రొడక్ట్ పేజీని ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ధర వివరాల పక్కనే ‘Price History’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేస్తే గత 30–90 రోజుల మధ్య ఆ వస్తువు పొందిన కనిష్ఠ మరియు గరిష్ఠ ధరలను గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. పండుగ సీజన్‌లు, స్పెషల్ సేల్స్ వంటి సందర్భాల్లో సరైన సమయంలో కొనుగోలు నిర్ణయం తీసుకోవడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమని నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: