ఓ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం అయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నో(Lucknow) లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఓ ట్రావెల్స్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తుంది. లక్నోలోని కిసాన్‌పాత్ వద్దకు రాగానే ఆ బస్సు(Bus)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల కారణంగా బస్సు డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ కండక్టర్ వెంటనే బస్సు(Bus)ను పక్కకు ఆపి బస్సు (Bus) అద్ధాలను ధ్వంసం చేసి కిందకు దూకారు.. అప్పటికే మంటలు బస్సు (Bus) మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐదు మంది ప్రయాణికులు మంటల్లో సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు, ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి ఉన్నారు.

బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రాణాలు ఎలా దక్కించుకున్నారు?
ఇక బస్సులోంచి తప్పించుకున్న డ్రైవర్, కండక్టర్ మంటల్లో చిక్కుకున్న మిగతా ప్రయాణికులను కాపాడారు. ప్రమాదంపై వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
బాధిత కుటుంబాలకు సంఘీభావం
\మంటలు చెలరేగిన తర్వాత కూడా బస్సు కిలోమీటర్ వరకు ప్రయాణిస్తూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే బస్సులో మంటలకు చెలరేగడానికి గల కారణాలపై ఇప్పవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. బస్సు(Bus) లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్లనే భారీగా ప్రాణనష్టం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ పర్యటన