Tahawwur Rana: కొంతసేపట్లో భారత్‌కు 26/11 ముంబయి దాడుల కీలక సూత్రధారి తహవ్వుర్ రాణా రానున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అతడిని తరలించేందుకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారు. రాణాను తీసుకువస్తోన్న విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే.. అతడిని అక్కడినుంచి జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. అప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతోపాటు కొన్ని సాయుధ వాహనాలు వెంట ఉంటాయి. అలాగే ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్‌ను అలర్ట్‌లో ఉంచారు. SWAT కమాండోలను విమానాశ్రయం వద్ద మోహరించారు.

ఈ సాయుధ వాహనం ఎలాంటి దాడినైనా తట్టుకొని నిలబడగలదు
ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మార్క్స్‌మ్యాన్ వాహనాన్ని సిద్ధంగా ఉంచారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సాయుధ వాహనం.. ఎలాంటి దాడినైనా తట్టుకొని నిలబడగలదు. దాడుల ముప్పు పొంచి ఉన్న వ్యక్తులను తరలించేందుకు భద్రతా సంస్థలు వీటిని ఉపయోగిస్తుంటాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్టయిన రాణాను అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు 16 ఏళ్లకు భారత్‌కు తీసుకువస్తున్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోన్న ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్ నియమితులయ్యారు. ముంబయి దాడి వెనక పాకిస్థాన్ నాయకుల పాత్రను నిర్ధరించే దిశగా విచారణ ఉండనుందని తెలుస్తోంది. దాంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
Read Also: మే చివరి నుంచే వర్షాలు పడే అవకాశం – స్కెమెట్