bullet train

ఏపీకి బుల్లెట్ ట్రైన్.. ?

ఏపీలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతోందా..? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలన్నది సీఎం చంద్రబాబు డ్రీమ్. పదేళ్ల నాటి కల ఆయనది. ఇందుకోసం 2014లో ఆయన ప్లాన్ చేశారు. అప్పట్లో సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని నిర్ణయించు కున్నారు. ఆలోచన చేశారు కానీ, కార్యరూపం దాల్చలేదు. కాకపోతే బుల్లెట్ ట్రైన్ అనేది సీఎం ఆలోచనలో అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది టీడీపీ. ఈ క్రమంలో తన కలల డ్రీమ్‌ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు.

రెండురోజుల కిందట ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. పనిలో పనిగా తన బుల్లెట్ ప్లాన్‌ను మోడీ ముందు పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాని నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, బుల్లెట్ ట్రైన్ విషయాన్ని రివీల్ చేశారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు సిటీలను కలుపుతూ బుల్లెట్ రైలు రానుందని వెల్లడించారు. చంద్రబాబు స్వయంగా చెప్పడం తో రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Related Posts
రైల్వేస్టేషన్‌లో కూలిన పైకప్పు
Collapsed roof at railway station

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ రైల్వేస్టేషన్‌లోని నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోవడం కలకలం రేపింది. సమాచారం Read more

తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు: వెంకయ్యనాయుడు
venkaiah naidu

తెలుగు భాష కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన భాషను మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగులో మాట్లాడని వారికి Read more

జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ – 2025 ప్రారంభం
National Karate Championship 2025 Commencement

హైదరాబాద్: జపాన్ కారాటే అసోసియేషన్ ఇండియా అద్వర్యం లో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక ఐదు రోజులపాటు నిర్వహించనున్న మొదటి జేకేఏ ఇండియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ Read more

కాసేపట్లో కాంగ్రెస్ కీలక సమావేశం
key meeting of the Congress

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఈరోజు గాంధీభవన్లో PCC రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి AICC Read more