ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న వారి భవిష్యత్తుకు బడ్జెట్ ఎలాంటి మార్గం వేస్తుందనే అంచనాలు వేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇన్వెస్టర్లు కూడా దీనిపై ఆసక్తిగా కన్నేసి ఉంచటంతో పాటు కొన్ని షేర్లు కొనుగోలు చేసేందుకు స్టాక్స్ ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలు మూడవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ 2025పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి బడ్జెట్ కోసం సంసిద్ధం కాగా.. ఉదయం 11 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఏఏ రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, ఎంత బడ్జెట్ కేటాయిస్తారనే ఉత్కంఠ ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోంది. ఈ క్రమంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు వాస్తవానికి సెలవు అయినప్పటికీ ప్రత్యేకంగా ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉంచబడ్డాయి.

యూనియన్ బడ్జెట్ 2025లో సంక్షేణం, అగ్రి అండ్ ఇన్‌ఫ్రాపై దృష్టి పెట్టవచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో మార్కెట్ నిపుణులు ఆగ్రోకెమికల్స్, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ బడ్జెట్ నుంచి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఛాయిస్ బ్రోకింగ్ కి చెందిన సుమిత్ బగాడియాతో పాటు మరో దేశీయ బ్రోకరేజ్ ఆనంద్ రాఠీకి చెందిన గణేష్ డోంగ్రే ఇన్వెస్టర్లకు బడ్జెట్ రోజున కొనుగోలు చేయాల్సిన కొన్ని షేర్లను సూచించారు. ట్రేడ్ కి అనుకూలమైన షేర్ల జాబితాను పరిశీలిస్తే.. బడ్జెట్ రోజున కొనదగిన స్టాక్స్.. మారుతీ సుజుకి: ఛాయిస్ బ్రోకింగ్ బగాడియా మారుతీ సుజుకీ షేర్లకు రూ.13172 టార్గెట్ ధరగా పేర్కొన్నారు. ఇదే క్రమంలో షేర్లను రూ.12,310.65 రేటు వద్ద కొనుగోలు చేయాలని సూచించింది. ఇదే క్రమంలో పెట్టుబడిదారులు స్టాప్ లాస్ ధరను రూ.11,880 వద్ద కొనసాగించాలని సిఫార్సు చేశారు.