parliament

రెండు విడుతలుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్‌ సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్న విషయం తెలిసిందే. తొలి విడత సమావేశాలు 31 నుంచి మొదలై.. ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. ఇక రెండో విడుత సమావేశాలు మార్చి 10న మొదలై.. ఏప్రిల్‌ 4 వరకు కొనసాగుతాయి. మంగళవారం విడుదలైన పార్లమెంటరీ బులిటెన్‌ ప్రకారం.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌-2025ను ప్రవేశపెడుతారు. అంతకుముందు రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత అరగంట తర్వాత.. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవుతాయి.

Advertisements


పార్లమెంట్‌ సమావేశాలకు ముందురోజు జనవరి 30న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. రాబోయే సమావేశాల్లో సభను సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్ష నాయకులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గతంలో సమావేశాలు జరిగిన తీరును ప్రస్తావించారు. రెండు సెషన్లలో పార్లమెంట్‌ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. దాంతో పార్లమెంట్‌ ప్రతిష్ట దెబ్బతిందని.. ఈ సమావేశాల్లోనైనా ప్రతిపక్ష నాయకులు, ఇతర ఎంపీలు చర్చల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షం సహకరిస్తేనే పార్లమెంట్‌ పని చేయడంతో పాటు చర్చలు జరుగుతాయన్నారు. ఈ సారి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెడుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts
Delimitation: వాజ్‌పేయికి కుదిరినప్పుడు మోదికి ఎందుకు కుదరదు: రేవంత్ రెడ్డి
Delimitation: వాజ్‌పేయికి కుదిరినప్పుడు మోదికి ఎందుకు కుదరదు: రేవంత్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం Read more

రిలయన్స్ క్యాపిటల్‌ కొనుగోలుకు ఇండస్ఇండ్ కు గ్రీన్ సిగ్నల్
రిలయన్స్ క్యాపిటల్‌ కొనుగోలుకు ఇండస్ఇండ్ కు గ్రీన్ సిగ్నల్

అనిల్ అంబానీ ప్రస్తుతం వార్తల్లో కనిపిస్తున్న ఈ వ్యాపారవేత్త అందరికంటే ముందుగానే అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించినప్పటికీ వాటిని సవ్యంగా నిర్వహించటంలో ఫెయిల్ అయ్యారు. దీంతో అప్పుల Read more

Holiday: ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం
ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజును పబ్లిక్ హాలీడేగా కేంద్ర Read more

రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త
Good news for retired emplo

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు తపాలా శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. పింఛన్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడం లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు ఇండియా పోస్ట్ Read more

×