BRS held a huge public meeting in April 27

నా మీద కూడా కేసులు న‌మోదు చేస్తారా డీజీపీ గారూ..? కేటీఆర్ ప్రశ్న

హైదరాబాద్‌: ఆ రైతును నేను కూడా కలిశాను… అతనితో మాట్లాడాను… మరి నాపై కూడా కేసు పెడతారా డీజీపీ గారూ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా గెలిచిందని, కేసీఆర్ గెలవాల్సిందని నల్గొండ జిల్లాలోని ముషంపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లయ్య అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ గౌతమ్ పోతగోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు ఆ జర్నలిస్ట్‌పై కేసు పెట్టారు.

Advertisements

ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. అసలు ఈ వీడియోలో తప్పు ఏముందని డీజీపీని ప్రశ్నించారు. జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్‌పై కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. నేను కూడా ముషంపల్లిలో రైతు మల్లయ్యను కలిశానని, అతనితో మాట్లాడానని వెల్లడించారు. అలాంటప్పుడు నాపై కూడా కేసు పెడతారా? అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

కేసీఆర్ గెలిస్తేనే మాకు బుక్కెడు బువ్వ దొరుకుతుందని, లేకుంటే కంపలో పడి చచ్చిపోయినట్లేనని రైతు మల్లయ్య అన్నారు. కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నా రావాలన్నారు. ఇప్పుడు మాత్రం నీళ్లు లేక… కరెంట్ లేక వ్యవసాయం లేదని, దీంతో చావాలనిపిస్తోందన్నారు. ప్రస్తుత పాలనలో రైతుబంధు రావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడున్నా రావాలని, ఆయనకే ఈసారి ఓటు వేస్తామన్నారు.

Related Posts
ఫెయింజల్ ఎఫెక్ట్ .. హైదరాబాద్‌ నుంచి విమానాలు బంద్‌
Fainjal effect . Flights f

ఫెంగల్ తుపాను దెబ్బకు హైదరాబాద్‌ నుంచి విమానాలు రద్దయ్యాయి. ఫెయింజల్ తుఫాన్ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా Read more

కాంగ్రెస్ నేతల సవాల్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సై
paadi koushik

జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ ఘటన చుట్టూ రాష్ట్ర రాజకీయాలు రగిలిపోతున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర చర్చలు, అభియోగాలు ఆరోపణలు నడుస్తున్నాయి. Read more

ప్రభుత్వ హాస్టల్లో హరీశ్ రావు కొత్త సంవత్సరం వేడుకలు
Harish Rao New Year Celebrations in Government Hostels

హైరదాబాద్‌: సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలలో మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం Read more

Revanth Reddy: రాహుల్ గాంధీ లేఖపై రేవంత్ రెడ్డి స్పందన
Revanth Reddy: రాహుల్ గాంధీ లేఖపై రేవంత్ రెడ్డి స్పందన

రాహుల్ గాంధీ లేఖకు సీఎం రేవంత్ రెడ్డి స్పందన: రోహిత్ వేముల చట్టానికి మద్దతు తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకునేందుకు, విద్యాసంస్థల్లో అభ్యాసాన్ని మరింత సమానతతో నింపేందుకు Read more

×