BRS Maha Dharna in Nalgonda today

నేడు నల్గొండలో బీఆర్ఎస్ మహా ధర్నా

హైదరాబాద్‌ : బీఆర్ఎస్ పార్టీ నేడు నల్లగొండ లో మహా ధర్నా నిర్వహించనుంది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా ఈ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా రైతులను నిలువునా ముంచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రైతు సమస్యలపై షాబాద్ లో రైతు ధర్నా చేసిన విషయం తెలిసిందే.

రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందని, వాటిని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఈ రైతు మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. నల్లగొండ క్లాక్ టవర్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కూడా పాల్గొననున్నారు. జంగ్ సైరన్ పేరిట ఈ ధర్నాను బీఆర్ఎస్ నిర్వహించనుంది.

image

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మహా ధర్నాను నిర్వహించాల్సి ఉంటుంది. ధర్నాలో జిల్లాలోని రైతులకు చేయాల్సిన రుణ మాఫీ, రైతు భరోసా, కింద మూడు విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సాయంపై సర్కార్‌ను నిలదీయనున్నారు. ఈనెల 21 మహా ధర్నా జరగాల్సి ఉండగా.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉండటంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 26న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

కాగా, జనవరి 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే బుద్ధి ఈ డూప్లికేట్ గాంధీలకు ఇవ్వాలని మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Related Posts
అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
116285323

అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో బన్నీని పోలీసులు చంచల్ Read more

కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి నకిలీ పోలీస్
Command And Control Centre

మరో ఫేక్‌ ఆఫీసర్‌ బాగోతం వెలుగులోకి మొన్న సెక్రటేరియట్ .. నేడు కమండ్ కంట్రోల్ లో భద్రతా వైఫల్యం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) Read more

నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు
నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు

బీహార్‌లోని పాట్నాలో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ను గాంధీ మైదానంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు Read more

Banana Farmers : అరటి రైతులకు రూ.1.10 లక్షలు – అచ్చెన్న
banana farmers

ఆంధ్రప్రదేశ్‌లో వడగండ్ల వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు Read more