BRS leader Manne Krishank arrested

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్టు

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా ఆయని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisements
image
image

కాగా, ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్‌.. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 7న విచారణకు కేటీఆర్‌ హాజరవాల్సి ఉన్నది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో.. తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు.

మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈడీ ఆఫీసు ముందు ఉన్న రోడ్డుపై వాహనాలను అనుమతించని పరిస్థితి. గన్‌పార్క్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లిస్తున్నారు. కేవలం ఆయ్‌కార్ భవన్ మీదుగా వచ్చే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. కాగా.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Related Posts
Mithun Reddy : ఎంపీ మిథున్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తున్న సిట్‌ అధికారులు
SIT officials are interrogating MP Mithun Reddy at length

Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మద్యం కుంభకోణం కేసులో సిట్‌ విచారణకు హాజరయ్యారు. విజయవాడలో సిట్‌ కార్యాలయానికి ఆయన ఈరోజు ఉదయం వచ్చారు. అనంతరం Read more

మార్చి 7న ఏపీ క్యాబినెట్ భేటీ
Cabinet approves AP Annual Budget

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మార్చి 7న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశం సచివాలయంలో జరుగుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్రంలోని Read more

Kerala: ఉద్యోగుల మెడకు గొలుసు.. కుక్కల్లా పరిగెత్తించిన కంపెనీ వీడియో వైరల్
ఉద్యోగుల మెడకు గొలుసు.. కుక్కల్లా నడిపించిన కంపెనీ వీడియో వైరల్

కేరళలోని కలూర్ ప్రాంతంలో జరిగిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీస్తోంది. తక్కువ పనితీరు కనబరిచిన ఉద్యోగులపై ఓ ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ వేసిన Read more

తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠా ఆ వ్యక్తులు – పట్టాభి
pattabhi jagan

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జగన్-షర్మిల ఆస్తుల పంపకం వివాదంపై స్పందించారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తుందని, తాడేపల్లి ఇంటికి విధేయంగా పనిచేస్తున్న Read more

×