BRS has no respect for the Speaker.. Minister Seethakka

స్పీకర్‌పై బీఆర్ఎస్‌కి గౌరవం లేదు : మంత్రి సీతక్క

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులు ఏంటో తేల్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. జగదీశ్ రెడ్డి దళిత స్పీకర్ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నాయకులకు అహంకారం ఇంకా తగ్గలేదని.. దళిత స్పీకర్ పై గౌరవం లేదని మండిపడ్డారు.

Advertisements
స్పీకర్‌పై బీఆర్ఎస్‌కి గౌరవం లేదు :

బీఆర్ఎస్ నాయకుల అహంకారం ఇంకా తగ్గడం లేదని

దళిత స్పీకర్ కాబట్టే నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధిస్తున్నారని… గతంలో గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు ఆయన కాళ్ళు మొక్కేవాళ్ళని అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మహిళా గవర్నర్ అంటే గౌరవం లేదని.. ఆదివాసీ రాష్ట్రపతి అంటే గౌరవం లేదని అన్నారు సీతక్క. బీఆర్ఎస్ నాయకుల అహంకారం ఇంకా తగ్గడం లేదని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల పీక్స్ కి చేరడంతో సభను 15నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్. దళిత స్పీకర్ పై గౌరవం లేకుండా మాట్లాడిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు.

Related Posts
తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు
తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందటంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణా ప్రజలు చికెన్ తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. Read more

AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలి : అక్బరుద్దీన్ ఒవైసీ
Survey should be conducted in GHMC with AI technology.. Akbaruddin Owaisi

హైదరాబాద్‌: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ..AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలని పేర్కొన్నారు. నాంపల్లిలో డబుల్ ఓటర్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే.. Read more

లోక్‌సభ లో జమిలి ఎన్నికల బిల్లు
WhatsApp Image 2024 12 17 at 1.06.13 PM (1)

ఎంతో కాలంగా బీజేపీ పట్టుదలతో జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న విషయం తెలిసేందే. ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు Read more

వాట్సాప్‌లో టీటీడీ, రైల్వే సేవలు: సీఎం చంద్రబాబు
TTD and railway services on WhatsApp.. CM Chandrababu

వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు.. అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల Read more

Advertisements
×