Britney Spears

Britney Spears Marriage: తనను తానే పెళ్లి చేసుకుని.. హనీమూన్‌కు వెళ్లిన బ్రిట్నీ స్పియర్స్

అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (42) గురించి ఇటీవల వార్తల్లో నిలిచింది ఆమె తన భర్త సామ్ అస్ఘరీ (30) నుండి విడిపోయిన విషయం తెలిసిందే వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు అయితే వారి వివాహ బంధం కేవలం 14 నెలలకే ముగిసింది 2023లో విడాకుల కోసం దరఖాస్తు చేసిన ఈ జంట గత మే నెలలో విడాకుల ఒప్పందానికి వచ్చింది ఇప్పుడు బ్రిట్నీ స్పియర్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్ అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తనను తానే పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపింది అక్టోబర్ 21ని ఆమె తన స్వీయ వివాహం తేదీగా గుర్తించింది ఇది మీకు వింతగా బుద్ధి లేని పని అనిపించవచ్చు కానీ నా జీవితంలో నేను చేసిన అద్భుతమైన నిర్ణయం ఇదే అని బ్రిట్నీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు ఆమె ఈ పోస్ట్‌తో పాటు పెళ్లి గౌను ధరించిన తన ఫొటోలను వీడియోలను షేర్ చేశారు ఆసక్తికరంగా వీడియోలో ఆమె నవ వధువు లాగా కనిపిస్తుండగా పక్కన ఎవరూ లేకపోవడం గమనార్హం ఆమె ఖాళీగా ఉన్న చర్చ్ ఫోటోలను కూడా షేర్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు బ్రిట్నీ తన సోషల్ మీడియా ఖాతాలో మరో పోస్ట్ చేసింది ఈ సారి ఒంటరిగా హనీమూన్‌కు బయలుదేరుతున్నట్లు తెలిపింది తన విమానం పక్కన నిలబడి తీసుకున్న ఫొటోను ఆమె పంచుకుంటూ టక్స్‌ అండ్ కేక్స్‌ నేను వచ్చేశా అని వ్యాఖ్యానించింది టక్స్‌ అండ్ కేక్స్ అనేది అట్లాంటిక్ సముద్రంలో ఉన్న దీవుల పేరు ఈ పోస్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి బ్రిట్నీ జీవితంలో జరిగిన ఈ వింత సంఘటన గురించి తెలుసుకున్న అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు ఇప్పటి వరకు బ్రిట్నీ స్పియర్స్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి ఇది నాలుగో సారి అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

    Related Posts
    సినీ పరిశ్రమపై తన అభిప్రాయాన్ని పంచుకున్న.సిద్ధార్థ్
    సినీ పరిశ్రమపై తన అభిప్రాయాన్ని పంచుకున్న.సిద్ధార్థ్

    సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్‌గా గుర్తింపు పొందిన సిద్ధార్థ్, అనేక విజయవంతమైన ప్రేమ కథలతో యూత్ ఫేవరేట్ హీరోగా మారాడు. తన కెరీర్‌లోని కొన్ని సంవత్సరాల్లో, Read more

    టాక్సిక్ మూవీ విడుదల ఎప్పుడంటే?
    టాక్సిక్ మూవీ విడుదల ఎప్పుడంటే

    "కేజీఎఫ్" ఫేమ్ యష్ నటిస్తున్న తాజా చిత్రం"టాక్సిక్"ఎంతగానో ఆసక్తిగ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో గ్రాండ్‌గా జరుగుతోంది మరియు ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతా Read more

    శోభితా నాకు ముందే తెలుసు: నాగార్జున
    శోభితా నాకు ముందే తెలుసు: నాగార్జున

    శోభితా నాకు ముందే తెలుసు, చై కంటే ముందే తెలుసునని నాగార్జున వెల్లడించారు నటుడు నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె Read more

    Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం… మేడమ్ టుస్సాడ్స్‌లో చెర్రీ మైనపు బొమ్మ
    mainapu bomma ramcharan

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ త్వరలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ప్రదర్శించుకోనున్నారు ఈ ప్రతిష్టాత్మక మ్యూజియంలో సింగపూర్ లోని మేడమ్ Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *