Terrorist Attack : జమ్ముకాశ్మీర్‌లోని టూరిస్టు స్పాట్ పహెల్గాం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహింతంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నేవి అధికారి లెఫ్టినెంట్ నర్వాల్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. నిన్న సాయంత్రం అధికార లాంఛనాలతో నర్వాల్‌కు అంత్యక్రియలు జరిగాయి.
మా అన్న బ్రతికే వాడు అని ఆవేదన
అనంతరం మీడియాతో నర్వాల సోదరి మాట్లాడుతూ.. కన్నీరుమున్నీరయ్యారు. ఆర్మీ సెక్యూరిటీ వాళ్ళు సమయానికి అక్కడికి వచ్చుంటే మా అన్న బ్రతికే వాడు అని ఆవేదన వ్యక్తంచేశారు. మా అన్న గంటన్నర పాటు ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు అని..మా అన్నను చంపిన ఉగ్రవాది తల తెచ్చి మాకు న్యాయం చేయండి అంటూ ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి రోదించారు. ఈ సందర్భంగా భర్త మృతదేహాన్ని హత్తుకుని భార్య హిమాన్షి విలపించిన తీరు, అక్కడున్న ప్రతీ ఒక్కరిని శోకసంద్రంలో పడేసింది.
దేశ సేవ పట్ల అపారమైన అంకితభావంతో పని
లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ దేశ సేవ పట్ల అపారమైన అంకితభావంతో పనిచేశారు. కేరళలోని కొచ్చిలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు సహచరులు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. ఎంతో ప్రతిభావంతుడిగా ఎదుగుతున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏప్రిల్ 16న వినయ్ వివాహం చేసుకొని, 19న రిసెప్షన్ ముగిసిన వెంటనే హనీమూన్ కోసం జమ్ముకశ్మీర్ వెళ్లారు. కానీ 22న జరిగిన ఉగ్రదాడిలో ఆయనను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులతో పాటు 28 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.
Read Also: మరోసారి జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. జవాన్ మృతి