వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (CWI) పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 29 ఏళ్ల వయసులోనే నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం, ఈ బోర్డు పాలన వైఫల్యానికి నిదర్శనమని లారా అన్నారు. అతని ప్రకటన వెస్టిండీస్ క్రికెట్‌కు ఒక హెచ్చరికగా మారిందని, ఈ పరిస్థితికి కారణమైన బోర్డు తక్షణమే మారాలని ఆయన స్పష్టం చేశారు.లారా (“Stick to Cricket”) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, “నేటి ఆటగాళ్లు తమ భవిష్యత్తు, ఆర్థిక భద్రత కోసం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ, నికోలస్ పూరన్ లాంటి యువ, ధీటైన ఆటగాడు అంత తొందరగా రిటైర్ అవుతాడంటే, అది వ్యవస్థలో లోపం ఉన్నదనే సంకేతం,” అని వ్యాఖ్యానించారు.ప్రతిభ కలిగిన ఆటగాళ్లను దేశం కోసం ఆడేలా చేయడంలో బోర్డు పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులను చూసైనా నేర్చుకోవాలని అన్నారు.

ఇలాంటి నిర్ణయాలు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐదు, ఆరు లీగ్ లు ఉన్నాయని ఇవి తమ ఆటగాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నాయని చెప్పారు. ఆటగాళ్లు జాతీయ జట్టులో కొనసాగేందుకు విండీస్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తమ కుటుంబాల కోసమే క్రికెటర్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా బోర్డు మేల్కొనాలని హితవు పలికారు.నికోలస్ పూరన్ (Nicholas Pooran) రిటైర్మెంట్ వెస్టిండీస్ క్రికెట్‌కు బిగ్ అలారమ్. బ్రియాన్ లారా (Brian Lara) చేసిన విమర్శలు బోర్డుకు ఓ క్లియర్ వార్నింగ్. సీడబ్ల్యూఐ బోర్డు తక్షణమే మారని పక్షంలో, వెస్టిండీస్ క్రికెట్ మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఇప్పుడు నిబద్ధత, వ్యూహాలు, మార్గదర్శకత అవసరం.
బ్రియాన్ లారా ఎవరు?
బ్రియాన్ లారా వెస్టిండీస్‌కు చెందిన మాజీ క్రికెట్ దిగ్గజం. అతడు ఓ ఎడమచేతి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ క్రికెట్‌లో తనదైన స్థానం ఏర్పరుచుకున్నాడు.
లారా స్పెషాలిటీ ఏమిటి?
లారా అత్యద్భుతమైన టెక్నిక్ కలిగిన ఎడమచేతి బ్యాట్స్‌మన్. అతను టెస్ట్ క్రికెట్‌లోనూ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట..ప్రభుత్వ రిపోర్ట్ బయటపెట్టిన హైకోర్టు