ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ (UPI) పేమెంట్లు సామాన్య ప్రజల నుంచి వ్యాపార స్థాయి వరకూ విస్తరించాయి. మొబైల్ యాప్స్ ద్వారా కూరగాయల కొనుగోలు నుంచి లక్షల రూపాయల లావాదేవీలు సులభంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్‌ను పూర్తిచేయడానికి పిన్ నంబర్ తప్పనిసరి. పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా ఎంటర్ చేయడం వల్ల అనేక మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పిన్‌కు బదులుగా ఫేస్ ఐడీ, బయోమెట్రిక్ ఉపయోగం
ఈ సమస్యలకు పరిష్కారంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక కీలక ఆవిష్కరణపై పనిచేస్తోంది. త్వరలోనే యూపీఐ పేమెంట్లను పిన్ అవసరం లేకుండానే ఫేస్ ఐడీ లేదా బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది. అంటే వినియోగదారుడు తాను నమోదు చేసుకున్న ఫింగర్ ప్రింట్ లేదా ముఖ సౌలభ్యం ద్వారా క్షణాల్లో లావాదేవీ పూర్తిచేయవచ్చు. అయితే పిన్ విధానం పూర్తిగా తొలగించబడదు; ఇది ఆప్షనల్‌గా కొనసాగుతుంది.
సురక్షితమైన లావాదేవీలకు దోహదం
ఈ కొత్త టెక్నాలజీ వల్ల యూపీఐ సైబర్ మోసాలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పిన్ లెక్కించడమే కాకుండా, బయోమెట్రిక్ సమాచారం చౌర్యానికి అత్యంత కష్టం. పైగా, పిన్ గుర్తుంచుకునే అవసరం లేకుండా నేరుగా బయోమెట్రిక్ ద్వారా లావాదేవీ చేయడం వల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలుగుతుంది. ఇది భారతదేశంలో డిజిటల్ పేమెంట్ విప్లవానికి మరో కీలక మలుపుగా భావించబడుతోంది.
Read Also : Stock Market : భారత స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్