हिन्दी | Epaper

Weather Report : తెలంగాణ లో రానున్న రెండ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?

Sudheer
Weather Report : తెలంగాణ లో రానున్న రెండ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మార్చబడుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన ప్రకారం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మిశ్రమ వాతావరణం ఉండబోతోంది. పగటిపూట ఎండలు మండిపోతూ ఉండగా, సాయంత్రం వేళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో వడగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.

ఆ జిల్లాలో వర్షం

కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే, ఈ కాలంలో గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని తెలిపింది.

Rain హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన

పగటిపూట ఎండలు..సాయంత్రం గాలులు

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పగటిపూట ఎండల తీవ్రత వల్ల నీరసం, డీహైడ్రేషన్ సమస్యలు రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం సమయంలో గాలులు, వర్షాల కారణంగా ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యవసాయ పనులు, బహిరంగ కార్యక్రమాలకు వెళ్లే వారు వాతావరణ సమాచారాన్ని తప్పనిసరిగా పరిశీలించి ప్రణాళికలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

పతనం అంచున ప్రజారోగ్యం

పతనం అంచున ప్రజారోగ్యం

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

📢 For Advertisement Booking: 98481 12870