हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Breaking News – KCR : కేసీఆర్ ఫామిలీకి సంబంధించిన విషయంలో మేము తలదూర్చం – కోమటిరెడ్డి

Sudheer
Breaking News – KCR : కేసీఆర్ ఫామిలీకి సంబంధించిన విషయంలో మేము తలదూర్చం – కోమటిరెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) చేసిన సంచలన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkat Reddy) స్పందించారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అంతర్గత విషయాలలో కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. అయితే, కవిత తన వ్యాఖ్యలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రస్తావించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎవరైనా సరే తమ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. కవితనే కాదు, మరెవరైనా రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసినా తాము ప్రతిస్పందిస్తామని ఆయన అన్నారు.

కాళేశ్వరం దొంగలు ఎవరో తేలుతుంది

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి అసలు దొంగలు ఎవరో సీబీఐ దర్యాప్తులో తేలుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరంపై విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, కవిత చేసిన వ్యాఖ్యలు విచారణకు మరింత బలం చేకూర్చాయని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహారం బీఆర్‌ఎస్‌లో నెలకొన్న తీవ్రమైన అంతర్గత కలహాలను సూచిస్తోందని ఆయన తెలిపారు.

బీఆర్ఎస్ పని అయిపోయినట్లే

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తుపై కూడా వ్యాఖ్యానించారు. సొంత కుటుంబ సభ్యుల మధ్య, పార్టీలోని కీలక నాయకుల మధ్య ఇలాంటి బహిరంగ విభేదాలు బయటపడటంతో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయినట్లేనని ఆయన అన్నారు. ఇవి ఆ పార్టీ పతనానికి సంకేతాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

https://vaartha.com/kannappa-to-be-streamed-on-ott-from-september-4/cinema/539677/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870