Visakhapatnam road accident : విశాఖపట్నం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం జంక్షన్ సమీపంలో రోడ్డును దాటుతున్న ఈశ్వరమ్మ (45) అనే మహిళను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
సబ్బవరం మండలం అరివేగుకు చెందిన ఈశ్వరమ్మ చేపలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయింది.
Read Also: Shikhar Dhawan ties knot : రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు భద్రత చర్యలు పెంచాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: