తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ముఖ్య వ్యాఖ్యలు చేశారు. TVK పార్టీ అధినేత విజయ్ రోడ్‌షో సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనలో 40మంది ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, విజయ్‌కు ఎలాంటి తప్పులేదని అన్నామలై పేర్కొన్నారు. “రోడ్‌షో నిర్వహణకు 7గంటల అనుమతి ఎందుకు ఇవ్వాలి? 2గంటలకే అనుమతి ఇచ్చి ఉంటే సరిపోని పరిస్థితి ఉండేది కాదు” అని ఆయన అన్నారు.
Breaking News – Karur Stampede : ప్రజల ఆర్తనాదాలను విజయ్ పట్టించుకోలేదు-ప్రత్యక్ష సాక్షులు
అన్నామలై (Annamalai) మాట్లాడుతూ..“ఎంతమంది రాబోతున్నారో అంచనా వేసి, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం, పోలీసులదే. విజయ్‌పై నిందలు వేయడం కరెక్ట్ కాదు” అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పడాన్ని ఆయన ప్రశ్నించారు. “ఎవరిని విచారణాధికారిగా నియమించాలో సీఎం ముందుగానే చెప్పడం విచిత్రంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.

“విజయ్‌పై చెప్పులు విసిరిన ఘటనపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ మొత్తం సంఘటనలో అనేక సందేహాస్పద అంశాలున్నాయి” అని అన్నామలై అన్నారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.