ఎప్పుడూ తన వ్యాఖ్యలతో, వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ). సినీ పరిశ్రమలో తన సొంత స్టైల్‌ను సృష్టించుకున్న ఈ దర్శకుడు, శివ, అంతం, రక్తచరిత్ర, సత్య వంటి సినిమాలతో భారతీయ సినిమాకు కొత్త దిశను చూపించాడు. అయితే వర్మకు సినిమాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు కూడా అంతే సెన్సేషన్ అవుతుంటాయి. ఆయన ఆలోచన విధానం, మాట్లాడే తీరు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది. ఎవరినైనా కించపరిచేలా మాట్లాడినా, ఆయనకు అభిమానించే వారు కూడా తక్కువేమీ కాదు. అందుకే ఆర్జీవీ పేరు వస్తే వివాదం, ఆశ్చర్యం రెండూ సహజం.
Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవలి కాలంలో మాత్రం వర్మలో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీపై గతంలో చేసిన విమర్శలు పెద్ద చర్చలకే దారి తీసినప్పటికీ, తాజాగా ఆయన వైఖరి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. ‘శివ’ రీ-రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న వర్మ, సోషల్ మీడియాలో చిరంజీవికి బహిరంగ క్షమాపణలు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. “మిమ్మల్ని బాధపెట్టినట్లయితే క్షమించండి. మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేయడం ద్వారా వర్మ తన వినయాన్ని చూపించాడు. ఆ ట్వీట్ చూసి నెటిజన్లు “వర్మకి ఏమైంది?” అంటూ ఆశ్చర్యపోయారు. గతంలో తిట్లతో నిండిన ట్వీట్లు చేసిన ఆర్జీవీ, ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలపడం నిజంగా అందరినీ షాక్‌కు గురిచేసింది.

అయితే ఆ షాక్ తగ్గకముందే వర్మ మరోసారి మెగా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాడు. రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్ గురించి ఆయన ప్రశంసలతో ముంచేశాడు. “సినిమా లక్ష్యం హీరోని ఎలివేట్ చేయడమే. చాలాకాలం తర్వాత రామ్‌చరణ్‌లోని సహజ శక్తిని ఈ పాటలో చూశాను. భారీ సెట్లు, ఎఫెక్ట్స్ లేకుండానే ఆయన రియలిస్టిక్ ఎనర్జీతో మెరిశాడు. బుచ్చిబాబు దాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నాడు” అంటూ వర్మ రాశాడు. ఈ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో సంబరాన్ని రేపాయి. “వర్మ చెప్పింది నిజం చరణ్ నిజంగా తన ఫుల్ ఫారంలో ఉన్నాడు” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు విమర్శకుడిగా ఉన్న ఆర్జీవీ ఇప్పుడు అభిమానిగా మారడాన్ని చూసి, సినీ వర్గాలంతా “ఇది వర్మలో కొత్త చాప్టర్!” అంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/