అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై ప్రశంసలు కురిపించారు. “ఇటీవల పాక్ ప్రధానితో పాటు ఫీల్డ్ మార్షల్ (మునీర్) కూడా అమెరికాకు వచ్చారు. ఆయన పాకిస్తాన్‌లో అత్యంత కీలకమైన వ్యక్తి” అని పేర్కొన్నారు. భారత్-పాక్ మధ్య గతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను గుర్తుచేసుకుంటూ, “నేను ఆ యుద్ధాన్ని ఆపి లక్షలాది మందిని కాపాడానని ఆయన చెప్పారు. అది విని నాకు చాలా గర్వంగా అనిపించింది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
News telugu: Diabetes-ప్రీడయాబెటిస్ లక్షణాలు ..?
భారత్-పాక్ (India-Pak) మధ్య గతంలో ఉద్రిక్తతలు ఎక్కువై, సైనిక ఘర్షణలు జరిగే పరిస్థితి ఏర్పడినప్పుడు తాను జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపానని ట్రంప్ మరోసారి గుర్తు చేశారు. “తీవ్రంగా మారుతున్న యుద్ధాన్ని అడ్డుకోవడం ద్వారా లక్షలాది ప్రాణాలను రక్షించాను” అని పేర్కొన్నారు. తన జోక్యం వల్ల రెండు అణ్వస్త్ర దేశాల మధ్య పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పిందని ట్రంప్ పరోక్షంగా సూచించారు.

అంతేకాకుండా, ఆఫ్రికా ఖండంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తాను మధ్యవర్తిత్వం చేసి, ఎంతో మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ అన్నారు. అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో తన పాత్రను ప్రస్తావిస్తూ, తాను తీసుకున్న చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా హింస, ఘర్షణలు తగ్గాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ మరోసారి తన విదేశాంగ వైఖరిని, దౌత్యపరమైన జోక్యాలను ప్రజల ముందు ప్రదర్శించారు.