ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ వర్షాల ముప్పులో చిక్కుకుంది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమ జిల్లాలు భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి రవాణా వ్యవస్థ దెబ్బతింటోంది. ముఖ్యంగా పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ, పరివాహక ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు చెరువుల్లా మారిపోవడంతో వాహనాలు కదలికలేమి పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి నుంచి నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Breaking News – Delhi Encounter : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్లు హతం
వాతావరణశాఖ ప్రకారం, ఈ వర్షాలు వచ్చే 24 గంటలపాటు కొనసాగే అవకాశం ఉందని, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు హెవీ టు వెరీ హెవీ రేన్ వార్నింగ్ జారీ చేసింది. పలుచోట్ల 15 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదవడంతో చెరువులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. వ్యవసాయ భూములు నీటమునిగే ప్రమాదం ఉంది. తిరుపతి జిల్లాలోని రేణిగుంట ప్రాంతాల్లో వరదనీరు రహదారులపైకి వచ్చి రాకపోకలు ఆగిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఫీల్డ్‌లోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తక్కువ ఎత్తున ఉన్న ప్రాంతాల ప్రజలు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలించమని సూచించారు. రాత్రివేళ బయటకు వెళ్లకూడదని, పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలే ప్రమాదం ఉండటంతో వాటి సమీపంలో తిరగవద్దని సూచించారు. రోడ్డు, వంతెనలు దెబ్బతినే అవకాశం ఉన్నందున రవాణా విభాగం పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వర్షపాతం స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండడం ద్వారా మానవనష్టం జరగకుండా నివారించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/