జాతీయ రహదారులపై (National Highways) ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2008లో అమలులోకి వచ్చిన టోల్ ఫీజు యూజర్ ఛార్జీల విధానాన్ని తాజాగా కేంద్ర రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్పులు అమలులోకి వస్తే, కొంతమేర టోల్ ఛార్జీలు సగానికి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సొరంగాలు, బ్రిడ్జిలపై కొత్త లెక్కింపు విధానం
ఇప్పటికే నిర్మితమైన సొరంగాలు, వంతెనలు ఉన్న జాతీయ రహదారుల్లో టోల్ (Toll Fee) లెక్కింపు పద్ధతిలో కీలక మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఆ టోల్ ప్లాజా పరిధిలో ఉన్న వంతెనల నిర్మాణ వ్యయం ఆధారంగా యూజర్ ఛార్జీలు నిర్ణయించబడుతుండగా, ఇప్పుడు ప్రయాణదూరం, వాహన రకాన్ని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు విధించనున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల ప్రయాణదారులపై భారం తగ్గనుంది.
వాహనదారులకు ఆర్థిక ఊరట
టోల్ ఫీజు తగ్గితే రోజూ హైవేల్లో ప్రయాణించే వాహనదారులకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఇంధన ఖర్చులతోపాటు టోల్ ఛార్జీల భారమూ తగ్గిపోవడంతో ఓవర్‌ఆల్ ప్రయాణ వ్యయం తగ్గే అవకాశం ఉంది. ఇది వాహనదారులకు లాభకరమే కాకుండా, దోహదపడే విధంగా మార్పులు చేపట్టడం కేంద్ర ప్రభుత్వానికి పాజిటివ్ ఇమేజ్ కలిగించనున్నది.
Read Also : One Big Beautiful Bill : ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పై ట్రంప్ సంతకం