కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Kaleshwaram Project)పై జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala ) జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌కు లేఖ రాశారు. గతంలో BRS ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు, అలాగే క్యాబినెట్ సమావేశాల మినిట్స్‌కి సంబంధించిన పత్రాలను ఈ లేఖతో పాటు పంపించారు. ఈ విషయాలన్నింటిపై కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
తుమ్మల – ఈటల వాదనల మధ్య భిన్నత
ఇప్పటి వరకు కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, 3 బ్యారేజీల నిర్మాణం క్యాబినెట్ ఉపసంఘం సూచనల మేరకే చేపట్టినట్లు తెలిపారు. అయితే ఈ వాదనను తుమ్మల ఖండించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఉపసంఘ నివేదిక రావడానికి ముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమయ్యిందని వివరించారు. దీనిని అధికారిక పత్రాలతో కమిషన్‌కు వివరించారు.
ప్రాజెక్టు అంచనాలు
తుమ్మల పంపిన లేఖతో కాళేశ్వరం ప్రాజెక్టుపై మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా BRS ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలు, వాటి వెనుక ఉన్న అధికారిక ప్రక్రియలపై విచారణకు ఇది బలమైన ఆధారాలుగా మారవచ్చని భావిస్తున్నారు. ఇక జూలైలో కమిషన్ తుది నివేదిక ఇవ్వనుండగా, తాజా లేఖ ఆ నివేదిక రూపకల్పనలో కీలకంగా నిలవనుంది.
Read Also : Thalliki Vandanam : రేపే ఖాతాల్లోకి రూ.15వేలు