బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ‘Thoofan‘ గా ఆందోళన కలిగించింది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రభావం చూపకుండా, రెండు నుంచి మూడు గంటల్లోనే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో దాటింది. దీనితో ఏపీకి గండం తప్పినట్లయింది. వాతావరణ శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
Thoofan ప్రభావం రాష్ట్రంపై లేకపోయినప్పటికీ, ఉత్తర కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. గాలి వేగంగా వీస్తుండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని ఐఎండీ స్పష్టంగా హెచ్చరించింది. ఈ వర్షాలతో పొలాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
హోంమంత్రిత్వ శాఖ ముందు జాగ్రత్త చర్యలు
అల్పపీడనం వల్ల వచ్చే వర్షాలు, వరదల పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో అవసరమైన సురక్షిత చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆమె ఆదేశించారు. నీటి నిల్వలు, చెరువులు, ఆనకట్టల పరిస్థితిపై అధికారుల నుండి నివేదికలు కోరారు. ప్రజల జీవనానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది
Read Also : PM Vikas Bharat Rozgar Yojana : ఆగస్టు 1 నుంచి అమల్లోకి మరో కొత్త పథకం