The RajaSaab box office : ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది రాజాసాబ్ విడుదలకు ఇక కొన్ని గంటలే మిగిలాయి. కల్కి 2898 ఏడి భారీ విజయానికి తర్వాత ప్రభాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో థియేటర్లలో సందడి నెలకొంది. ఈసారి హారర్ కామెడీ జానర్‌లో నటించడంతో ఫ్యాన్స్‌లో మంచి ఉత్సాహం కనిపిస్తున్నా, సాధారణ ప్రేక్షకుల్లో మాత్రం ఆ స్థాయిలో హైప్ కనిపించడం లేదు.
సినిమా ప్రకటించినప్పుడు అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ, ప్రచార కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. రెండో ట్రైలర్ కొంత బజ్ క్రియేట్ చేసినా, ప్రభాస్ గత చిత్రాలతో పోలిస్తే అది బలహీనంగానే ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దర్శకుడు మారుతి స్టార్ డైరెక్టర్ కాకపోవడంతో, సినిమా పూర్తిగా ప్రభాస్ స్టార్ పవర్‌పైనే ఆధారపడిందని చెప్పవచ్చు.
Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
జానా నాయకన్ వాయిదాతో రాజాసాబ్‌కు లాభం
జనవరి 9న విడుదల కావాల్సిన జానా నాయకన్ వాయిదా పడటంతో, ది రాజాసాబ్కు సోలో రిలీజ్ లభించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది (The RajaSaab box office) రాష్ట్రాల్లోనూ మంచి స్క్రీన్ కౌంట్ దక్కింది. హిందీ మార్కెట్‌లో కూడా సరైన షోస్‌తో విడుదలవుతోంది. ఈ అంశాలన్నీ కలిసి సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్ సాధించేందుకు దోహదపడతాయని అంచనా.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, ది రాజాసాబ్ భారత్‌లో తొలి రోజు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ కెరీర్‌లో అతిపెద్ద ఓపెనింగ్ రికార్డును మాత్రం ఇది మిస్ చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ, ఇది ప్రభాస్ టాప్ ఓపెనర్స్ లిస్టులో ఆరో స్థానాన్ని దక్కించుకునే అవకాశముందని అంచనా.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: