తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గ్రూప్-1 పరీక్షల ఫలితాల్లో మహిళలు తమ సత్తా చాటారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) విడుదల చేసింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 6న ప్రొవిజనల్ మార్కులు విడుదల చేసిన కమిషన్, అభ్యంతరాల పర్యవసానంగా పేపర్ల రీకౌంటింగ్‌ను పూర్తి చేసి ఉగాది పర్వదినాన జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసింది.

గ్రూప్-1 ఫలితాల్లో మహిళల ప్రాభవం
టీజీపీఎస్సీ విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్స్‌లో మహిళలు ముందంజలో ఉన్నారు. మల్టీ జోన్-2కి చెందిన ఓసీ కేటగిరీ మహిళా అభ్యర్థి 900 మార్కులకు గాను 550 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. మొత్తం టాప్ 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం. 525 మార్కులకు పైగా స్కోర్ చేసిన అభ్యర్థుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. గ్రూప్-1 టాపర్స్- రెండవ, మూడవ స్థానాల్లో పురుష అభ్యర్థులు నిలిచారు. టాప్ 10లో ఆరుగురు మహిళలు ఉండటం గర్వించదగ్గ విషయం. 500 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థుల సంఖ్య 52గా ఉంది. TGPSC జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం, అర్హత సాధించిన అభ్యర్థులను త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలవనున్నారు. వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన అభ్యర్థులకు వ్యక్తిగతంగా సందేశాలు పంపించడంతో పాటు, అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా ప్రచురించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అనంతరం ఉద్యోగ నియామకాల తుది జాబితాను TGPSC ప్రకటించనుంది. TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకారం, వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇకపై ఏ ఏడాది ఖాళీలు ఉన్నాయో, ఆ ఏడాదికే పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు.