రాష్ట్రవ్యాప్తంగా(TG Panchayat Elections) తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్(Election polling) ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే, 1 గంట సమయానికి క్యూ లైన్లలో నిలబడిన ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసిన వెంటనే, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల(vote) లెక్కింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ విడతలో విజేతలుగా నిలిచిన సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలను రాత్రికి ప్రకటించి, అనంతరం ఉప సర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. పోలింగ్ మొత్తం మీద శాంతియుతంగా జరిగింది. ఎన్నికల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.
Read also: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు షాక్.. నోటీసులు జారీ

తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ వివరాలు
ఈ తొలి(TG Panchayat Elections) విడతలో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, వాటిలో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. వీటిలో మొత్తం 12,960 మంది అభ్యర్థులు పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తం మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు 93,905 మంది సిబ్బందిని నియమించారు. వీరితో పాటు 3,591 మంది రిటర్నింగ్ అధికారులు, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొన్నారు. పారదర్శకత కోసం 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ తొలి విడత ఎన్నికల కోసం 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: