(TG) స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మూడో విడత పోలింగ్ ఆర్మూర్ డివిజన్‌లో బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలూర్, బాల్కొండ, భీమ్‌గల్, మెండోరా సహా 11 మండలాల్లో 146 సర్పంచ్, 1130 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. (TG) మొత్తం 3,06,795 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శాంతియుత పోలింగ్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read Also: Sarpanch Rights : సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: