Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువుగా ఉండటం అంటే రాజకీయాలు చేయడం లేదా అబద్ధాలు ప్రచారం చేయడం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. “నేను కూడా హిందువునే. మా ఊరిలో రాముడి గుడి నిర్మించాం. కానీ మానవత్వం(Humanity) అనేది చాలా ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు. దసరా వేడుకల విషయంలో బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ద్వంద్వ వైఖరిపై విమర్శలు
‘ధర్మస్థల ఛలో'(Dharmastala chalo) యాత్ర కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, దానివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని సిద్ధరామయ్య అన్నారు. ఒకవైపు సిట్ విచారణను వ్యతిరేకించని బీజేపీ, ఇప్పుడు దాని వల్ల ఏమీ రాదని తెలిసి వ్యతిరేకించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. దసరా ఒక మతానికి సంబంధించిన పండుగ కాదని, అది అందరూ కలిసి జరుపుకునే రాష్ట్ర పండుగ అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా, తన స్వగ్రామంలో ఒక పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తూ తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై ఎందుకు విమర్శలు చేశారు?
బీజేపీ రాజకీయాలు, అసత్య ప్రచారాలను ఖండిస్తూ, హిందువుగా ఉండటం అంటే అది కాదని ఆయన విమర్శలు చేశారు.
దసరా ఉత్సవాలపై వివాదం ఏమిటి?
బుకర్ ప్రైజ్ గెలుచుకున్న రచయిత్రి భాను ముస్తాక్‌ను దసరా ఉత్సవాల ప్రారంభానికి ఆహ్వానించడంపై వివాదం నెలకొంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :