బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపించిన కేసీఆర్, ఇప్పుడు వరుస సమావేశాలతో దూకుడు పెంచుతున్నారు. (Telangana) ముఖ్యంగా శాసనసభ సమావేశాలు సమీపిస్తున్న వేళ, పార్టీని మళ్లీ పోరాటానికి సిద్ధం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Read also: TG: సంక్రాంతి కానుక: త్వరలో యాసంగి రైతు భరోసా డబ్బులు..

ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సమావేశం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. (Telangana) అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎలా ఎదురుదాడి చేయాలన్న అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అలాగే రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన బహిరంగ సభలు, నియోజకవర్గ స్థాయి కార్యక్రమాల తేదీలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ నేతలకు సూచించినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: