हिन्दी | Epaper

తెలంగాణ కేబినెట్ భేటీకి ముహుర్తం ఫిక్స్..!

sumalatha chinthakayala
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహుర్తం ఫిక్స్..!

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా.. హైడ్రా కు ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నించేవారికి ఆర్డినెన్స్ తో చెక్ పెట్టారు.

జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ కొనసాగింపుగా జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం హైడ్రాకు అధికారాలను బదాలయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓఆర్ఆర్, హైడ్రా పరిధిలో మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వం అధికారాలను బదాలయించింది. దీంతో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కలు, జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయి. ఫలితంగా ఇక నుంచి నోటీసులు జారీ చేయడం, మౌఖిక ఆదేశాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చేయడానికి, సీజ్ చేయడానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రాములు కన్నుమూత

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రాములు కన్నుమూత

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

నిజామాబాద్‌లో బస్సు ప్రమాదం, నలుగురు మృతి

నిజామాబాద్‌లో బస్సు ప్రమాదం, నలుగురు మృతి

ముగ్గురు విద్యార్థినులపై క్లాస్ మెట్ అఘాయిత్యం

ముగ్గురు విద్యార్థినులపై క్లాస్ మెట్ అఘాయిత్యం

కోకాపేటలో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం

కోకాపేటలో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం

నేటి నుండి తెలంగాణ లో వెహికల్ రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం

నేటి నుండి తెలంగాణ లో వెహికల్ రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం

లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్

లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

📢 For Advertisement Booking: 98481 12870