పశ్చిమబెంగాల్లో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు కోల్కతాలో తీవ్ర ఆందోళనకు (Teachers Protest) దిగారు. సుప్రీంకోర్టు తీర్పుతో తమ జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయని, తాము చేసిన సేవకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో టీచర్లు అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
వివాదాస్పద నియామకాలు – రద్దయిన వేలాది ఉద్యోగాలు
2016లో పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చేపట్టిన టీచర్ల నియామకాల్లో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడంతో 25,753 మంది టీచర్ల నియామకాలు రద్దయ్యాయి. దీంతో ఉద్యోగం కోల్పోయిన టీచర్లు నిరసన ప్రదర్శనలకు పాల్పడుతున్నారు.
నిరసనపై పోలీసుల స్పందన – అరెస్టులు
టీచర్లు అర్ధనగ్నంగా రోడ్డుపై నిరసన తెలపడం పోలీసులకు షాక్ ఇచ్చింది. ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు రంగంలోకి దిగారు. అనంతరం 50 మందికిపైగా నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, తమ పోరాటం న్యాయం కలిసే వరకు కొనసాగుతుందని టీచర్లు స్పష్టం చేస్తున్నారు.
Read Also : CBI : రూ.20 లక్షలు లంచం.. ED అధికారిని పట్టుకున్న CBI