టీసీఎస్‌లో ఉద్యోగులకు షాక్
భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ టీసీఎస్ (Tata Consultancy Services) ఉద్యోగులకు వరుసగా షాక్‌లు ఇస్తోంది.2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలతో పాటు ఉద్యోగుల తొలగింపు నిర్ణయంను కూడా ప్రకటించింది.
కేవలం మూడు నెలల్లోనే సుమారు 20 వేల మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించినట్లు(TCS Layoffs) సమాచారం. సరైన సమాచారం ఇవ్వకుండా ఉద్యోగులను ఇంటికి పంపించిందని ఉద్యోగుల సంఘం నైట్స్ యూనియన్ తీవ్రంగా విమర్శించింది.
Read also: Chandrababu – Modi : మోదీని కలవడం గర్వంగా ఉంది – CM చంద్రబాబు

సంఘాల ఆగ్రహం – ప్రభుత్వ జోక్యం డిమాండ్
టీసీఎస్‌లో జరుగుతున్న లేఆఫ్స్‌ను యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ మరియు యునైట్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
- బెంచ్ పాలసీలో మార్పులు
- AI (Artificial Intelligence) చేరికతో ఆటోమేషన్ పెరుగుదల
- అనుభవజ్ఞుల స్థానంలో తక్కువ వేతనాలతో ఫ్రెషర్ల నియామకం
ఇవన్నీ ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తున్నాయని యూనియన్లు చెబుతున్నాయి.
ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
టీసీఎస్ వివరణ మరియు ఆరోపణలు
టీసీఎస్(TCS Layoffs) యాజమాన్యం మాత్రం “పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేవలం 1 శాతం ఉద్యోగులను మాత్రమే తొలగించాం” అని స్పష్టం చేసింది.
అయితే యూనియన్ల ప్రకారం, ఈ సంఖ్య 30 వేల మందికి పైగా ఉందని ఆరోపిస్తున్నారు.
టీసీఎస్ 2.55 లక్షల కోట్ల ఆదాయం కలిగిన సంస్థ కావడంతో, లాభాల కోసం ఉద్యోగులను తొలగించడం అన్యాయమని విమర్శిస్తున్నారు.
సంస్థ ఉద్యోగులను తొలగించడం కాకుండా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని ఉద్యోగులు సూచిస్తున్నారు.
టీసీఎస్ ఎందుకు ఉద్యోగులను తొలగిస్తోంది?
పునర్వ్యవస్థీకరణ, ఆటోమేషన్, AI టెక్నాలజీ ప్రవేశంతో లేఆఫ్స్ చేపడుతోంది.
ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు?
టీసీఎస్ ప్రకారం 6–12 వేల మంది, కానీ యూనియన్ల ప్రకారం 30 వేల మంది వరకు ప్రభావితమయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :