Sudha Murthy deepfake video : ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు Sudha Murthy తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వీడియోలపై ప్రజలను అప్రమత్తం చేశారు. పెట్టుబడి పథకాల్లో డబ్బులు పెట్టాలని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియోలు పూర్తిగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో తయారు చేసినవేనని, వాటిని నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు.
ఈ మేరకు సుధామూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఫొటో, వాయిస్‌ను అనుమతి లేకుండా ఉపయోగించి ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని, వాటిని ఆధారంగా చేసుకుని ఎవరూ ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తాను ఎప్పుడూ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లను ప్రచారం చేయలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయనని స్పష్టంగా తెలిపారు.
Read Also: AP: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
ఇటీవల ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలను నమ్మి బెంగళూరుకు (Sudha Murthy deepfake video) చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ రూ.23.20 లక్షలు నష్టపోయిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై జనవరి 13న బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సుధామూర్తి మరోసారి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
ఎవరైనా అనుమానాస్పద వీడియోలు లేదా సందేశాలు కనిపిస్తే వాటిని వెంటనే సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు రిపోర్ట్ చేయాలని, ఏ సమాచారం అయినా అధికారిక వనరుల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని ఆమె సూచించారు. సైబర్ మోసాల బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: