తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసింది. జనవరి 30న (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులు ఇవ్వగా, కేసీఆర్ దీనిపై లిఖితపూర్వకంగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తాను బిజీగా ఉన్నానని, పార్టీ అధినేతగా అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చే పనిలో ఉన్నందున ఇప్పుడే విచారణకు రాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని కోరుతూ జూబ్లీహిల్స్ ఏసీపీకి ఆయన లేఖ రాశారు.
Tamil Nadu Elections : విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్
కేసీఆర్ లేఖపై సానుకూలంగా స్పందించిన సిట్ అధికారులు, ఆయనకు మరింత సమయం ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. చట్టప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిని పోలీసు స్టేషన్‌కు పిలవకుండా వారి నివాసంలోనే విచారించాలనే నిబంధనను కేసీఆర్ తన లేఖలో గుర్తుచేశారు. అందుకే తనను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లోనే విచారించాలని, భవిష్యత్తులో నోటీసులు కూడా అక్కడికే పంపాలని ఆయన కోరారు. అయితే, సిట్ అధికారులు మాత్రం ఆయన శాసనసభ రికార్డుల్లో ఉన్న నందినగర్ నివాసం అడ్రస్‌కే తదుపరి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే సిట్ తన తదుపరి అడుగు వేయనుంది.

ఈ విచారణ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు వంటి ముఖ్య నేతలను విచారించిన సిట్, జైలులో ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ‘పెద్దాయన’ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై క్లారిటీ తీసుకోవడమే లక్ష్యంగా దర్యాప్తు సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ముగిసిన తర్వాతే ఈ విచారణ ఉండవచ్చని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా, సిట్ మరోసారి ఎప్పుడు నోటీసులు ఇస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com