కరూర్ ప్రాంతంలో ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ (Tamil Vetri Kazhagam) అధినేత విజయ్ (Vijay) నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. ఘటన తర్వాత తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Darjeeling: డార్జిలింగ్ లో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి?
ఈ ఘటనపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, విజయ్‌కు మరో షాక్ తగిలింది.కరూర్ సభ జరగడానికి కొన్ని గంటల ముందు విజయ్ ప్రచార రథం ఇద్దరు యువకులను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆ ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: