జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వీణ అనే మహిళ చేస్తున్న ఆరోపణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాను ఎమ్మెల్యేను ట్రాప్ చేశానంటూ వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. శ్రీధర్ ఒక “డమ్మీ క్యాండిడేట్” అని, ఆయనను ట్రాప్ చేయాల్సిన అవసరం తనకు లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు దాదాపు ఆరుగురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలకు దమ్ముంటే ఆధారాలు చూపాలని ఆమె ఎమ్మెల్యేకు బహిరంగ సవాల్ విసిరారు.
Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి
ముఖ్యంగా ఈ వివాదంలో వినిపిస్తున్న “రూ. 25 కోట్ల డిమాండ్” అంశంపై వీణ స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వాయిస్ రికార్డింగ్ తనది కాదని ఆమె తేల్చి చెప్పారు. తనను అప్రతిష్ట పాలు చేసేందుకే ఇలాంటి తప్పుడు ఆడియోలను సృష్టించారని ఆరోపించారు. అయితే, తాను ఎమ్మెల్యేతో మాట్లాడిన కొన్ని విషయాలను స్క్రీన్ రికార్డ్ చేశానని, అది కూడా ఆయనకు తెలిసే చేశానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ నిజస్వరూపం త్వరలోనే బయటపడుతుందని, న్యాయ పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.

ఈ పరిణామాలు జనసేన వర్గాల్లో మరియు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఒక ప్రజా ప్రతినిధిపై ఇలాంటి తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో, అసలు నిజానిజాలు ఏమిటనేది విచారణలో తేలాల్సి ఉంది. అటు ఎమ్మెల్యే అనుచరులు ఇవన్నీ కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలని కొట్టిపారేస్తుండగా, వీణ మాత్రం తాను బాధితురాలినని, తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com