RRB NTPC Railway Jobs 2025 : RRB NTPC రైల్వే జాబ్స్ 2025 నిరుద్యోగులకు భారీ శుభవార్త – 8,875 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్! 2025 సంవత్సరానికి సంబంధించిన భారీ రైల్వే రిక్రూట్‌మెంట్ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB NTPC Railway Jobs 2025) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 8,875 రైల్వే పోస్టులు భర్తీ చేయబడ్డాయి. షార్ట్ నోటీస్ ప్రకారం, సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025) త్వరలో పూర్తి వివరాలతో విడుదల అవుతుంది.
పోస్టుల వివరాలు:
- గ్రాడ్యుయేట్ స్థాయి: మొత్తం 5,817 పోస్టులు
- గూడ్స్ రైలు మేనేజర్ – 3,423
- జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ – 921
- స్టేషన్ మాస్టర్ – 615
- సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ – 638
- చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్ – 161
- మెట్రో రైల్వే ట్రాఫిక్ అసిస్టెంట్ – 59

- అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి: మొత్తం 3,058 పోస్టులు
- కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ – 2,424
- అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ – 394
- జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ – 163
- రైళ్స్ క్లర్క్ – 77
RRB ఈ నోటిఫికేషన్‌లో అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, సిలబస్ మరియు జోన్ల వారీగా ఖాళీల వివరాలు త్వరలో అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు పరిశీలించవచ్చు.
Read also :