బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపిస్తూ, రేవంత్ రెడ్డి హద్దు మీరిపోయారని అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు.
హీరోయిన్ల ఫోన్లకూ హ్యాకింగ్
రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతో కలిసి సినీ పరిశ్రమలోని పలువురి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మైహోంభుజాలో ఏ హీరోయిన్‌ను కలిశావో మాకు తెలుసని, నీవు తిరిగిన 16 మంది వివరాలు మాకు లభించాయని అన్నారు. తన ఫోన్ హ్యాక్ చేస్తున్నారనే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని చెప్పారు. అంతేగాక, తన భార్య ఫోన్ కూడా హ్యాక్ చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే ఈడీ, సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
కేబినెట్ రద్దుకు కారణం
ఈరోజు జరగాల్సిన కేబినెట్ సమావేశం రద్దయిందని, దీనికీ కారణం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమేనని కౌశిక్ రెడ్డి తెలిపారు. మంత్రులంతా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేయనున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు కూడా రేవంత్ reddyపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ట్యాపింగ్ వ్యవహారంపై స్పష్టత వచ్చే వరకు కేబినెట్ సమావేశాలకు మంత్రులు హాజరుకాలేమని చెప్పారని వివరించారు.
Read Also : Heavy Rains : తెలంగాణ ప్రజలకు IMD వార్నింగ్.!